శ్రీముఖి కి స్వయంవరం...గెలిచింది ఎవరు!
on Jul 15, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో మొత్తం హిస్టారికల్ థీమ్ తో క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. శ్రీముఖి స్వయంవరం ఈ ఎపిసోడ్ లో నిర్వహించబోతున్నారు. దాంతో అవినాష్, హరి కలిసి శ్రీముఖిని బాగా ఎలివేట్ చేశారు. "పరివారం దేశపు యువరాణి..148 ఎపిసోడ్లుగా ప్రయాణం చేస్తున్న అలుపెరగని యోధురాలు..ఎంతోమంది మనసులు గెలుచుకున్న అందగత్తె.. మా శ్రీముఖి యువరాణి వచ్చేస్తున్నారహో" అని చెప్పారు. దాంతో శ్రీముఖి యువరాణి కాస్ట్యూమ్ మెరిసిపోతూ స్టేజి మీదకు వచ్చింది. ఆ పక్కనే రోహిణి కూడా అదే గెటప్ లో వచ్చింది. దాంతో అవినాష్ "యువరాణి అమ్మగారికి నా ప్రణామాలు" అన్నాడు. "ఆవిడ నా అమ్మగారు కాదు" అంది శ్రీముఖి. "ఇంత అందమైన బొమ్మను చూసి అమ్మా అందువా" అంటూ రోహిణి డైలాగ్ వేసింది. "మరీ చూడడానికి మాసిపోయినట్టు ఉంది" అంటూ కౌంటర్ వేసాడు అవినాష్. "మిమ్మల్ని చూసుకోవడానికి ఎంతో మంది యువరాజులు పక్క రాజ్యం నుంచి వస్తున్నారు" అంటూ శ్రీముఖి స్వయంవరం నిర్వహించారు అవినాష్, హరి.
ఇక ఈ షోకి వచ్చిన లేడీ టీమ్ లో అమ్మాయిలు అబ్బాయిలను చూసి ఫ్లాట్ ఇపోయారు. దాంతో "అమ్మా ఇష్టసఖులు అబ్బాయిల్ని చూసి మరీ లేకీగా ప్రవర్తించకూడదమ్మా" అంటూ కౌంటర్ ఇచ్చాడు. "మేము లేకీగా ప్రవర్తించట్లేదు. మాకు ఏమీ లేక ప్రవర్తిస్తున్నాం" అంది రోహిణి. ఇక ఆ షోకి వచ్చిన అబ్బాయిలంతా పెద్ద కత్తులతో వచ్చారు. " ఏంటి ఆర్జే చైతు మాత్రం చిన్న కత్తితో వచ్చాడు" అంటూ శ్రీముఖి తెగ ఫీలైపోయింది. వెంటనే రోహిణి "ఆ కత్తిని చూసి నేను కన్నుమూసెదను" అనేసింది. దాంతో అందరూ నవ్వారు. ఇక బాలు ఈ షోకి వచ్చాడు. రాగానే శ్రీముఖి అతని కాళ్లకు వంగి నమస్కారం చేసింది. అతను ఒక పువ్వు ఇచ్చాడు. దాంతో శ్రీముఖి ఫిదా ఐపోయింది. "వాళ్ళ కత్తుల కన్నా మీ పువ్వే నచ్చింది" అని చెప్పింది. దాంతో శ్రీకర్ "ఇక మేము మా కత్తులు పట్టుకుని బయల్దేరుతాము" అనేశాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
